రోజువారీ మలవిసర్జన కు ‘ఎనిమా’ – కి అలవాటు పడ్డ వ్యాధిగ్రస్తులకు: సిరిధాన్యాల…

రోజువారీ మలవిసర్జన కు ‘ఎనిమా’ – కి అలవాటు పడ్డ వ్యాధిగ్రస్తులకు: సిరిధాన్యాల తో ఊరట.

కొందరు పేషెంట్స్ అడిగారు –
‘మేము పూర్వపు వైద్యుల కారణం గా ఒక 8 – 10 ఏళ్ళ నుండి ‘ఎనిమా’ చేయించుకోవడానికి అలవాటు పడిపోయాము. అది చేస్తే కానీ మలవిసర్జన చేయలేని పరిస్థితి కి వచ్చేసాము.
ఇందుకు సిరి ధాన్యాలు ఏదైనా దారి చూపుతాయా’ అంటూ.
వీరే కాదు. కొందరు క్యాన్సర్ పేషెంట్ లు కూడా అన్నిరకాల తీవ్రమైన ‘థెరపీ’ లు అయినాక, 3 రోజులకూ, అయిదు రోజులకూ కూడా మలం బయటకు తీయలేని పరిస్థితి లో ఉంటారు. అంటువంటి వారికి కూడా వెంటనే మెరుగుదల మార్గం చూపిన డాక్టర్ ఖాదర్ సూచనలు ఇక్కడ పొందు పరుస్తున్నాము:

a ) సిరిధాన్యాల ను ఈ విధంగా వాడుకోవాలి :

అండు కొర్ర బియ్యం : 2 రోజుల పాటు వరుసగా.(Browntop Millet)
అరికెల బియ్యం : 2 రోజుల పాటు వరుసగా.(Kodo Millet)
సామెల బియ్యం : ఒక రోజు (Little Millet)
ఊదల బియ్యం : ఒక రోజు (Barnyard Millet)
కొర్ర బియ్యం : ఒక రోజు (Foxtail Millet)

ముఖ్యమైన విషయం : ఈ సిరిధాన్యాలను గంజి రూపం లోనే 3 పూటలా ఆరగించాలి. గంజి తో పాటుగా, చారు, కూరగాయలూ మొదలైనవి తినవచ్చు.

‘గంజి చేసేందుకు’ 3 – 4 గంటలు నీటి లో నానపెట్టిన ధాన్యానికి 5-6 రెట్లు ఎక్కువ నీటిని చేర్చి గంజి తయారయేలా అధికం గా ఉడకపెట్టుకోవాలి .
ఈ 7 రోజుల సిరి ధాన్యాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే తిరిగి పాటించాలి. ఒక 5 రోజుల్లో తేడా తెలిసిపోతుంది. మూడు వారాల్లో సమస్య మాయమవ వచ్చు.
మలబద్ధకం ఉన్నవారు కూడా ఈ ధాన్యాల అన్నము, గంజి వాడకం ద్వారా త్వరగా మలబద్ధకం నుండి విముక్తి పొందగలరు .
(ఒక రోజుకు ఒకే ధాన్యాన్ని బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలనే ముఖ్య సూత్రాన్ని మరిచి పో కూడదు.)

b) ‘చెక్క గానుగ లో తీసిన శుద్ధమైన నూనె’ కూడా వ్యాధుల నివారణ లో ఉపకరిస్తుంది.
కొబ్బరి నూనె : ఒక వారం పాటు ఉదయాన్నే 2 చెంచాలు సేవించాలి. కాలేయము, క్లోమగ్రంధుల శుద్ధీకరణ దీని ద్వారా సాధ్యమౌతుంది

c) కషాయాలు : మెంతి ఆకు కషాయం, రావి ఆకు కషాయాలు ఇందుకు తగినవి.
ఒక్కొక్క వారం పాటు ఒక్కొక్క ఆకు కషాయాన్ని — ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లలో, ఖాళీ కడుపు మీద సేవించాలి. వారానికి ఒకటి చొప్పున మార్చుకోవాలి.
( కషాయం : గ్లాసున్నర నీటి లో చిన్న ఆకులైతే రెండు గుప్పిళ్ళ ఆకులను, లేదా పెద్ద ఆకులైతే 6 -7 ఆకులను చిన్న ముక్కలుగా చేసుకుని 4 నిమిషాలపాటు ఉడికించి, గోరువెచ్చగా, వడకట్టుకుని త్రాగాలి. అవసరమనుకుంటే, శుద్ధమైన తాటి బెల్లపు లేత పాకం చేసుకుని 2-3 చుక్కలు కషాయాలకు కలుపుకోవచ్చు )
ఈ కషాయాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే పాటించాలి.

రాగి కడవ లో ఒక రాత్రి నిలువ ఉంచిన నీటిని త్రాగటం మంచిది.

రోజూ 50 నుంచి 75 నిమిషాల నడక ను మరువకండి. రకరకాల కూరగాయలు, ఆకు కూరలు తినండి.
పైన చెప్పిన విధానాలను శ్రద్ధ గా పాటించి ఆరోగ్యాన్ని పొందండి. ఈ విజ్ఞానాన్ని నలుగురికీ పంచండి.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు (5 మిల్లెట్ లు) !

ఆధునిక రోగాలను సిరి ధాన్యాల తో రూపు మాపుదాం !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *